ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి ఏం ప్రయోజనం సుస్మిత?

September 06, 2026

img

మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత తన తల్లికి జరిగిన అన్యాయం గురించి కన్నీళ్ళు పెట్టుకొని వలవల ఏడ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మా అమ్మ కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. బయట పార్టీల నుంచి వచ్చి జైలుకి వెళ్ళివచ్చినవారు ఇప్పుడు మా అమ్మకి ఈ గతి పట్టించారు. నేను మాట్లాడిన మాటలతో అమ్మకు ఏం సంబంధం?మా నాన్నకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అడగడం తప్పా? వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేస్తానని చెప్పడం తప్పా? ” అంటూ సుస్మిత కన్నీళ్ళు పెట్టుకున్నారు.

దీనినే చేతులు కాలక ఆకులు పట్టుకోవడం అంటారు. రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవంటే ఇదే. ఆమె తల్లి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, తన వాళ్ళ ప్రభుత్వానికి, ఆమెకు ఇబ్బంది కలగకూడదని గ్రహిస్తే ఆవిధంగా మాట్లాడి ఉండేవారు కారు. కానీ అప్పుడు మా నియోజకవర్గంలో అభ్యర్ధిని ప్రకటించడానికి సిఎం రేవంత్‌ రెడ్డి ఎవరు?ఇలాగే వ్యవహరిస్తే ఢిల్లీ నుంచి సీల్డ్ కవరులో మరో సిఎం పేరు వస్తుంది,” అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడి తల్లి మంత్రి పదవిని ఊడగొట్టారు.

కనుక ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? పైగా ఇప్పటికీ సిఎం రేవంత్‌ రెడ్డి గురించి అనవసరమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. కొండా సురేఖని కాంగ్రెస్‌ పార్టీ రోడ్డు మీద పడేయలేదు. తన మాటలతో సుస్మితే తల్లిని రోడ్డున పడేలా చేశారు. కనుక ఇప్పటికైనా ఆచితూచి మాట్లాడితే మంచిది.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.

ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు… ఆత్మహత్యలే ఉంటాయి.

రోజులు మారిపోయాయి…“మా అంత మొనగాడు లేడు, పార్టీ మీద ఆధారపడకుండా సొంతంగా గెలిచాం, ఇండిపెండెంట్‌గా నిలబడినా గెలుస్తాం” అనే అహంకారం ప్రస్తుత రాజకీయాల్లో పనిచేయదు... https://t.co/xBw232E7c1 pic.twitter.com/hNkiyTkVvy
— 🃏☸ Viśva Naruḍu ☸🃏 (@Dollar_567) September 5, 2026

Related Post