కొండా సురేఖ బర్త్ రఫ్... గవర్నర్‌కు సిఎం లేఖ

September 03, 2026


img


మంత్రి కొండా సురేఖని మంత్రివర్గంలో నుంచి తొలగిస్తున్నట్లు సిఎం రేవంత్‌ రెడ్డి ఓ లేఖ ద్వారా గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని నియమిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను, వరంగల్‌ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్‌పర్సన్‌గా జి.సుధారాణిని నియమిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసేందుకు అంగీకరించకపోవడంతో, కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరించినట్లే సిఎం రేవంత్‌ రెడ్డి ఆమెను మంత్రివర్గంలో నుంచి తొలగించారు. 

ఆమె రాజీనామా చేయకుండా బర్త్ రఫ్‌కు మొగ్గు చూపారంటే, కొండా దంపతులు కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు సిద్దపడ్డారని భావించవచ్చు. మరికొద్ది సేపటిలో వారు ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడబోతున్నారు. కనుక కొత్తగా ఏం బాంబులు పేలుస్తారో చూడాలి. 



Related Post