ముందు కవిత ఆరోపణలకు జవాబు చెప్పండి: కడియం

September 02, 2026


img

ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనను, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేటీఆర్‌, హరీష్‌ రావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు జనగామ జిల్లా, గణపురంలో కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ముందు కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి. తన తండ్రి హయంలో అందరూ కలిసి తెలంగాణని నిలువు దోపిడీ చేసారని కవిత ఆరోపిస్తున్నారు కాదా?

మీ అవినీతి సొమ్ము పంపకాలలో తేడా వచ్చినందునే ఆమెను బయటకు సాగనంపారు. అందుకే ఆమె మీ అవినీతి భాగోతాలన్నీ బయటపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు వెనకేసుకున్నారని ఆమె ఆరోపణలు నిజం కావా?

అందుకే కేసీఆర్‌ అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్‌ క్రుంగిపోయిన మాట వాస్తవం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చేసేందుకు కుట్ర జరిగిందని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? ఒకవేళ కుట్ర జరిగితే అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదు?

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, దమ్ముంటే కల్వకుంట్ల కవిత మీపై చేస్తున్న ఆరోపణలకి జవాబు చెప్పండి,” అని కడియం శ్రీహరి అన్నారు. 


Related Post