శ్రీకృష్ణుడిగా రామ్‌చరణ్‌.. విజయ్‌ దేవరకొండ?

September 02, 2026


img

ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ గుజరాతీ సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ పై ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రను రామ్‌చరణ్‌ పోషించనున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించనున్నట్లు ‘బాలీవుడ్‌ హంగామా’ ఓ కథనంలో పేర్కొంది. 

కనుక ‘లాలో’ తెలుగు రీమేక్‌ తెరకెక్కడం ఖాయమని స్పష్టమవుతోంది. ఒకవేళ విజయ్‌ దేవరకొండ ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తే, ఆయన కెరీర్లో ఇదో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉంటుంది.   

గతేడాది విడుదలైన గుజరాతీ చిత్రం ‘లాలో: కృష్ణ సదా సహాయతే’లో పెద్ద హీరోలు ఎవరూ లేదు. పైగా కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ కృష్ణ మాయ అన్నట్లు ‘లాలో..’ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి గుజరాతీ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

ఓ ఆటో డ్రైవర్‌ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ప్రేమించిన పెళ్ళి చేసుకున్న భార్య విడిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యి దుర్వ్యవసనాలకు అలవాటు పడిన అతనికి మనిషి రూపంలో వచ్చిన శ్రీకృష్ణుడు సరైన మార్గంలో నడిపిస్తాడు. ఈ కథ నేపథ్యంలో మనిషి జీవితంలో జరిగే తప్పులు,. వాటిని ఏవిధంగా సరిదిద్దుకోవాలనేది ఈ సినిమా ద్వారా తెలియజెప్పారు. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి దిల్‌ రాజు, విజయ్‌ దేవరకొండ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Related Post

సినిమా స‌మీక్ష