ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అయన శ్రీకృష్ణదేవరాయలుగా నటిస్తున్న చిత్రం ‘దేవరాయ’ టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు. రాజసం ఉట్టిపడేలా శ్రీకృష్ణదేవరాయలుగా సుదీప్ లుక్స్, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో దేవరాయల కోట, సామ్రాజ్యం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఆకట్టుకుంటాయి.
శ్రీకృష్ణదేవరాయల జీవిత గాథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ఆయన అధికారం, వైభవం, సామ్రాజ్య విస్తరణ, యుద్ధాలు, వారసత్వం అన్నిటినీ దేవరాయలో చూపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా 2027 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌరహరి సంగీత దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.