తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా నటించిన గ్రామీణ కామెడీ సినిమా ‘పళ్ళ బురుసు’ ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కనుక మూడు వారాలలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి, కీలక పాత్రలు చేశారు.
పళ్ళు తోముకునే బ్రష్ విషయంలో జరిగిన చిన్న గొడవ కోర్టు వరకు వెళ్ళడమే ఈ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు.