మిస్సింగ్ మేఘన సెకండ్ సాంగ్

September 01, 2026


img

వాచస్పతి దర్శకత్వంలో ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమాలో రామ్‌ కార్తీక్, వైదిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విన్నావా ప్రేమా’  అంటూ సాగే రెండో పాట విడుదలయ్యింది. ఆర్ఆర్ ధృవన్ వ్రాసి సంగీతం సమకూర్చిన ఈ పాటని దీపు మధురంగా ఆలపించారు.  

మిస్సింగ్ మేఘనలో రామ్‌ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే: వనరాజ్; సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్; కెమెరా: శ్యాం కే నాయుడు; డైలాగ్స్: వెంకట్ బాదిగం; పాటలు: ఆర్‌ ఆర్‌ ధృవాన్; ఆర్ట్ డైరెక్టర్‌: గురు మురళీకృష్ణ; ఎడిటింగ్: బసవ; ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్ చేస్తున్నారు. 

ఫస్ట్ కాపీ మోవీస్, కేడి అండ్ కో బ్యానర్లపై దేవెళ్ల శ్రీనివాసరావు సహ నిర్మాతగా నరేష్ బాబు పంచుమర్తి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష