సర్దార్-2 ట్రైలర్‌.. కార్తి యాక్షన్ అదుర్స్

September 01, 2026


img

కోలీవుడ్‌ హీరో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఊపిరి వంటి స్ట్రెయిట్ సినిమాతో పలు తెలుగు డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించారు. 

ఇప్పుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్-2తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో ఓ సాధారణ తమిళ వ్యక్తిగా కనిపించే కార్తి, భారత్‌ ప్రభుత్వ సీక్రెట్ ఏజంట్‌గా ఓ కీలకమైన మిషన్‌లో పాల్గొన్నట్లు చూపారు. గుడి ఎదుట శూలం పట్టుకొని డాన్సులు చేసే కార్తి, యుద్ధ విమానంలో చేసిన యాక్షన్ సన్నివేశాలు కూడా అంతే అలవోకగా చేశారు. కనుక కార్తిని భిన్నకోణాలలో చూపించిన ఈ చిన్న ట్రైలర్‌ సర్దార్-2పై అంచనాలు పెంచిందని చెప్పవచ్చు.     

 ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, యోగిబాబు, రజిషా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు కథ దర్శకత్వం: పీఎస్ మిత్రన్, స్క్రీన్‌ప్లే: నంబి, సంగీతం: సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఆర్ట్: ఎంఎస్‌పీ మాధవన్, బి. శేఖర్, యాక్షన్ కొరియోగ్రఫీ: దిలీప్ సుబ్బరాయన్, చేతన్ డిసౌజా; ఎడిటింగ్: విజయ్ వెలుకుట్టి చేస్తున్నారు. 

ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/lnLsKCQzf3Q?si=_czvZenCMUPqod-_" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష