మంత్రి కొండా సురేఖని మంత్రివర్గంలో నుంచి తప్పించడం ఖాయమైనట్లు సమాచారం. ఆమె కుమార్తె సుస్మిత సిఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసినందుకు ఆమెపై వేటు వేయాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. సిఎం రేవంత్ రెడ్డి సోమవారం లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి రాగానే ఆమెకు తెలియజేయకుండానే డెప్యూటేషన్‌పై ఆమె శాఖలో ఉన్నవారిని వెనక్కు రప్పించడం ఇందుకు తొలి సంకేతంగా భావించవచ్చు.
ఒకరిద్దరు మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ వివరాలను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. మంత్రులను తొలగిస్తే వారికీ అవమానకరంగా ఉంటుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. కనుక వారిని రాజీనామాలు చేసి తప్పుకోవాలని కోరబోతున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక ఆలోగా ఈ మార్పులు చేర్పులు చేపడతరా లేదా అవి ముగిసిన తర్వాత చేపడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికునే అవకాశం ఉంది.