హీరోలు అడిగితే తప్పు లేదు కానీ... దీపిక పడుకొనే ట్వీట్‌

August 22, 2026


img

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పడుకొనేని తప్పించడంపై ఆ సినిమా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. 

సినిమా లాభాల్లో 10 శాతం వాటాతో పాటు ఇతర డిమాండ్లు చేయడం వల్లనే దీపికాను పక్కన పెట్టాల్సివచ్చిందని ప్రణయ్ రెడ్డి అన్నారు. .

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దీపికా పడుకొనే నేరుగా స్పందించలేదు కానీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రీలో హీరోలు ఇలాంటి డిమాండ్లు చేస్తే వాటిని ప్రొఫెషనలిజంగా చూస్తారు. అదే హీరోయిన్‌ అడిగితే ఆమెను ‘డిఫికల్ట్’ అని ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు. ఇలాంటి ఆలోచనా ధోరణి ఇండస్ట్రీలో పురుషాదిపత్యానికి నిదర్శనం కాదా?,” అని దీపిక ప్రశ్నించారు. 

ఆమె ఇటీవల మరో బిడ్డని ప్రసవించినందున రోజుకి 8 గంటలే పని చేస్తానని షరతు విధించారు. దానిపైనే ఇండస్ట్రీలో వాదోపవాదాలు సాగుతున్నప్పుడు, పారితోషికం పెంపు, లాభాలలో వాటా అడగడం, ఆ కారణంగా ఆమెను టాలీవుడ్‌ తిరస్కరిస్తుండటం ఇంకా కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. 

ఆమె అడిగిన ఈ ప్రశ్న సహేతుకంగానే ఉంది. కనుక దీనిపై కూడా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తప్పక మరో కొత్త చర్చ మొదలవుతుంది. 


Related Post