ప్రముఖ హాస్యనటుడు అలీ సతీమణి జుబేదాకు గుండె సంబంధిత ఏర్పడటంతో అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేశారు. సినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఆయన, భార్య ఆరోగ్య పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరో తీసిన ఆ వీడియోని చూసిన అభిమానులు జుబేదా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
హాస్య నటుడుగా అలీ ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారో, అదేవిధంగా జుబేదా కూడా తన యూట్యూబ్ ఛానల్లోని వంటల వీడియోలతో అంతే పేరు సంపాదించుకున్నారు.
అలీ, జుబెదాలు 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి ఫాతిమా రమీజున్, జువేరియా మిథీ అనే ఇద్దరు కుమార్తెలు, మహమ్మద్ అబ్దుల్ సుభాన్ అనే ఓ కుమారుడు ఉన్నారు.
శస్త్ర చికిత్స తర్వాత జుబేదా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. పూర్తిగా కోలుకున్నాక ఆస్పత్రి నుంచి డిస్ ఛార్జ్ షీట్ చేస్తారు.