రామాయణలో సీతమ్మవారిగా నటించిన సాయి పల్లవి, ఇప్పుడు ‘ఓం’ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓం చాప్టర్ 1: ఉధిరం- ది బ్లడ్ వుడ్’ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.
తిరుమల శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘ఓం’ పేరుతో చేపట్టే ఆపరేషన్‌కు ఆమె నాయకత్వం వహిస్తారు.
అటవీ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీధర్ రెడ్డి కుమార్తెగా నిత్యారెడ్డి పాత్రను ఫస్ట్ గ్లిమ్స్‌లో పరిచయం చేశారు. ఎప్పుడూ సాత్విక పాత్రలు చేసే సాయిపల్లవి హతాత్తుగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ సన్నివేశాలు చేస్తూ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం అందరినీ అలరిస్తుంది.
సూపర్ హిట్ మూవీ ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్, మమ్ముట్టి, శ్రీలీల, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి, సంగీతం: సాయి అభ్యంకర్, కెమెరా: ఎజిల్ అరసు కె, యాక్షన్: యానిక్ బెన్, కెచా ఖంఫక్డీ, ఆర్ట్: ఎ. పన్నీర్‌సెల్వం, కొరియోగ్రఫీ: శాండీ, ఎడిటింగ్: ఆర్. కళైవాణన్ చేశారు.
ఆర్ టేక్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రద్ధ అగర్వాల్, ధనుష్, అజ్మాట్ జగ్‌మంగళవారం కలిసి నిర్మిస్తున్న ఈ ‘ఓం’ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.