తెలంగాణలో 150 మంది రైస్ మిల్లర్లు అరెస్ట్

October 25, 2026
img

తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులపై దాడులు చేపట్టారు. 

ఆదివారం తెల్లవారుజాము నుంచి వివిధ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి, 150 మందికి పైగా రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 

కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటే ఏమిటి?

ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తుంది. దానిని వారు మరపట్టి నాణ్యమైన సన్న బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. దీనినే కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటారు.  

అయితే కొందరు మిల్లర్లు సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వానికి అప్పగించాల్సిన సన్న బియ్యాన్ని పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వలన ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలుగుతోంది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించగా ఇది వాస్తవమేనని తేలింది. 

కనుక ప్రభుత్వ ఆదేశం మేరకు సీఐడీ అధికారులు రంగంలో దిగి ఆదివారం ఉదయం 5 గంటల నుంచే రాష్ట్రంలో పలు జిల్లాలలోని రైస్ మిల్లింగ్ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. 

ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌తో సహా 150 మందికి పైగా రైస్ మిల్లర్లను సీఐడీ అదుపులోకి తీసుకున్నారు. అదివారం మధ్యాహ్నం సమయానికి ఇంకా తనికీలు కొనసాగుతున్నాయి. కనుక మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 

ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవహారంలో కొందరు అధికారులు, వ్యాపారుల ప్రమేయం కూడా ఉందని సీఐడీ గుర్తించి  విచారణ జరుపుతోంది. 

Related Post