తమిళ న్యూస్ రీడర్ ప్రియవదన ఆత్మహత్య

October 24, 2026
img

ప్రముఖ తమిళ న్యూస్ రీడర్, నటి ప్రియవదన (24) ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజుల క్రితం అంటే ఈ నెల 21న ఆమె చెన్నైలోని తన ఫ్లాట్‌లో ఫ్యానుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. ఇరుగు పోరుగువారిని, ఆమె సహోద్యోగులను బంధుమిత్రులని ప్రశ్నించి ఆమె ఆత్మహత్యకు కారణం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

ప్రియవదన తొలుత ‘వెందర్ టీవీ’లో న్యూస్ రీడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ న్యూస్ ఛానెల్ ‘తంతి టీవీ’లో కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

వార్తలు చదవడంతో పాటు నటనపై ఆసక్తితో సినిమాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు.

ప్రియవదన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండేవారు. ఇటీవలే తన 24వ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. ఆమె మరణానికి రెండు రోజుల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బందుమిత్రులు షాక్ అయ్యారు. 

Related Post