సాయిదుర్గా తేజ్‌కు జోడీగా కన్నడ నటి సప్తమి గౌడ

October 25, 2026


img

రోహిత్ కేపీ దర్శకత్వంలో సాయిదుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చేస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.

ఈ సినిమా చేస్తుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. తేజ కాకుమాను దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో  సాయిదుర్గా తేజ్‌కు జోడీగా కన్నడ నటి సప్తమి గౌడ నటించబోతున్నారు. 

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమాతో సప్తమి గౌడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు లేదా నవంబర్‌ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కనుక త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వస్తాయి.


Related Post

సినిమా స‌మీక్ష