వెంకటేష్‌ కామెడీ+యాక్షన్: ఆదర్శ కుటుంబం ట్రైలర్‌

October 24, 2026


img

విక్టరీ వెంకటేష్‌కి ఆ పేరు ఎందుకు వచ్చిందో ‘ఆదర్శ కుటుంబం (హౌస్ నం: 47) ట్రైలర్‌ చూసిన తర్వాత మరోసారి అర్ధమవుతుంది. ఆయన గంభీరమైన, యాక్షన్ సన్నివేశాలు ఎంత అద్భుతంగా చేస్తారో, కామెడీ కూడా అంత కంటే గొప్పగా చేయగలరని ఆదర్శ కుటుంబం ట్రైలర్‌తో మరోసారి నిరూపించుకున్నారు. 

ముఖ్యంగా అయన కామెడీ టైమింగ్ దానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పంచ్ డైలాగులు కలిస్తే అవి మరింత గొప్పగా పేలుతాయి. 

“అకార్డింగ్ టూ సీతారామశాస్త్రి పాటకు వరం... చీటీ పాట మాత్రం క్షవరం.. పోయిట్రీ నాన్నా... కవి స్వతంత్రుడు... ఏమైనా ఆలోచిస్తాడు... కానీ ఏమీ చేయడు..”అనే డైలాగ్, “మా మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఏముంటుందన్నా? అమ్మడానికి ఆస్తి ఉండదు.. కొనడానికి డబ్బు ఉండదు. లేదని ఒప్పుకోవడానికి మొహమాటం.. ఉందని చెప్పుకుకోవడానికి పరువు తప్ప,” వంటి డైలాగ్స్... వాటిని ఆయన చెప్పిన విధానం చిన్న శాంపిల్స్ మాత్రమే.   

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. రావు రమేష్,  బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేశారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష