సెప్టెంబర్ 7నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

August 25, 2026


img

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించి, సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేస్తారు. 

ఆనవాయితీ ప్రకారం సమావేశాలకు ఒకటి రెండు రోజుల ముందు మంత్రివర్గ సమావేశం నిర్వహించి ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపుతారు. అలాగే కాళేశ్వరంతో సహా రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు, మూసీ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఆమోదించే అవకాశాలున్నాయి.       

ఇక ప్రతిపక్ష పార్టీలకు ఈసారి ప్రభుత్వంతో పోరాడేందుకు చాలా అస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22-ఏ జీవో ఈ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయం. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం చెల్లిస్తానన్న రూ.12,000 బకాయిలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

కనుక ఈసారి కూడా ఎప్పటిలాగే శాసనసభ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.


Related Post