నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకె-111’కు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఇటీవల కాకినాడ పోర్టులో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుందగా బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. కనుక షూటింగ్ ఆలస్యం అవుతోంది.
అందువల్ల ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు టైటిల్ గ్లిమ్స్ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఏఎ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.