హైదరాబాద్‌లో మాజీ ఏపీ మంత్రి అరెస్ట్

August 23, 2026


img

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి సీనియర్ వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదివారం సాయంత్రం  హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అరెస్ట్ చేశారు. జగన్‌ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అయనని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 

మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున జారీ చేసిన మద్యం రవాణా టెండర్ ప్రక్రియను కొందరికి అనుకూలంగా మార్చి, సబ్ కాంట్రాక్టుల ద్వారా అక్రమంగా రూ.195.30 కోట్లు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. దీనిలో సుమారు రూ.15 కోట్లు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌ ఖాతాలలో జమా అయినట్లు ఈడీ కనుగొంది. 

ఈ కేసులో భారీగా డబ్బు చేతులు మారినందున ఈడీ కూడా వేరేగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తోంది. ఈ సబ్ కాంట్రాక్టు వ్యవహారాలను హ్యాండిల్ చేసిన సునీల్‌ని ఇది వరకే అరెస్ట్ చేశారు. ఇప్పుడు తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది.


Related Post