సుస్మిత దెబ్బకి సురేఖ మంత్రి పదవికి గండం?

August 21, 2026


img

తరచూ వివాదాలలో చిక్కుకునే మంత్రి కొండా సురేఖ ఈసారి తన సొంత కూతురు సుస్మిత కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. అంతే కాదు.. కూతురు కారణంగా మంత్రి పదవి కూడా కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. 

సిఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత అవినీతి ఆరోపణలు చేస్తే వాటిని ఆమె ఖండించాలి కదా? కానీ వాటితో సంబంధం లేదని తప్పించుకోవడం సరికాదని ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐల్య, బల్మూరి వెంకట్, వేముల వీరేశం ప్రశ్నించారు. ఆమెను తక్షణం మంత్రి పదవిలో నుంచి తొలగించాలని, సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొండా సుస్మితని పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

 సుస్మిత వ్యాఖ్యల వెనుక బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలతో పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొందరు వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉన్నారని వారన్నారు. 

నాయని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో కూడా కొండా సురేఖ సత్సంబంధాలు లేవు. ఎన్నడూ ఎవరినీ గౌరవించింది లేదు. మీకు మంత్రి పదవి ఇచ్చి సిఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని గౌరవిస్తే, మీ కుమార్తె సుస్మిత, ఏకంగా సిఎంనే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు మాట్లాడారు. 

సొంత పార్టీలో నేతలే సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి తప్పుగా మాట్లాడుతుంటే, ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకుంటాయా? పార్టీ క్రమశిక్షణ పాటించనందుకు ఇద్దరిపై కటిన చర్యలు తీసుకోవాలని నాయని డిమాండ్ చేశారు.

video credit: RTV


Related Post