సుస్మిత కొణిదెల నిర్మాతగా జగమే సంగీతం వెబ్‌ సిరీస్‌

August 20, 2026


img

సుస్మిత కొణిదెల మెల్లగా నిర్మాతగా నిలద్రొక్కుకుంటున్నారు. తాజాగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ‘జగమే సంగీతం’ అనే వెబ్‌ సిరీస్‌ సిద్ధం చేశారు. 

కర్ణాటక సంగీతాన్ని తరతరాలుగా వారసత్వంగా కొనసాగిస్తున్న ఓ కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ‘శాస్త్రి’ పాత్ర ఈ కథలో కీలకంగా ఉంటుంది. ఆ కుటుంబంలో సంగీత వారసత్వం ఏవిధంగా కొనసాగిందనేది ఈ వెబ్‌ సిరీస్‌ మూలకథ. దీనిలో ప్రముఖ నటులు శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

కర్ణాటక సంగీతం... దానిని వంశపారంపర్యంగా కొనసాగిస్తున్న కుటుంబాలపై మారుతున్న పరిస్థితుల ప్రభావం, తరాల అంతరం, కుటుంబంలో సమస్యలు వంటివన్నీ ఈ వెబ్‌ సిరీస్‌లో చూపబోతున్నారు. 

‘జగమే సంగీతం’ వెబ్‌ సిరీస్‌కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 240 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష