రంభ, ఊర్వశి, మేనక కోసం బ్యాడ్ టైమ్‌ బ్యాండ్ బాజా..

August 20, 2026


img

చంద్రమోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సురభి జంటగా చేస్తున్న కామెడీ సినిమా ‘రంభ, ఊర్వశి, మేనక.’ ఈ సినిమా నుంచి  ‘బ్యాడ్ టైమ్‌ బ్యాండ్ బాజా..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. భాస్కరభట్ల రవి కుమార్‌ వ్రాసిన ఈ పాటని రామ్‌ మిరియాల హుషారుగా పాడారు. ఈ పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, వేద కోరియోగ్రఫీ చేశారు. 

ఈ సినిమాలో డా.కామాక్షి భాస్కర్, సాయి కుమార్‌, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన కుమార్‌, గగన్ విహారీ, అనిష్ కురువిళ్ళ, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: చంద్ర మోహన్ చింతాడ, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, కెమెరా: రామ్ రెడ్డి, డైలాగ్స్: నందు సవిరిగాన చేస్తున్నారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, ప్రసాద్ నిమ్మకాయల కలిసి నిర్మిస్తున్నఈ సినిమా సెప్టెంబర్‌ 4న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష