అక్టోబర్ 2న థియేటర్లలోకి సిగ్మా

August 19, 2026


img

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న‘సిగ్మా’ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని, అక్టోబర్ 2న గాంధీ జయంతినాడు సిగ్మా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 

తమిళనాడు సిఎం జోసఫ్ విజయ్‌ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. తండ్రి సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలోకి వెళ్ళగానే కొడుకు దర్శకుడుగా కోలీవుడ్‌ ప్రవేశించడం విశేషమే కదా?  

ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అంబు థాసన్, యోగ్ జపి, మహాలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు పాటలు: వివేక్, సూపర్ సుబ్బు; సంగీతం: థమన్ ఎస్ ; ఎడిటర్‌: ప్రవీణ్ కేఎల్ ; కెమెరా: కృష్ణన్ వసంత్; వీఎఫ్‌ఎక్స్‌ప్రెస్‌: హరిహరసుతన్;  యాక్షన్; వెంకట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషలలో నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష