మెఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ విడుదల

August 16, 2026


img

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మెఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న ‘ఆస్మాన్’ టీజర్ విడుదలైంది. రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. 

ఆగస్ట్ 15న నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా, ఇప్పుడు టీజర్‌ విడుదల చేశారు. 

ఈ సినిమాలో మెఘాంశ్ శ్రీహరి సరసన రయాంచ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా థ్రిల్లర్ కథను ఎంచుకున్న మెఘాంశ్.. ‘ఆస్మాన్’తో తన కెరీర్‌లో మరో మంచి ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: రామ్ నందన్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: షోయబ్. 

శ్రీ క్లీంకార సెల్యులోయిడ్స్ బ్యానర్‌పై కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, అరబిక్ భాషల్లో తెరకెక్కుతున్న ‘ఆస్మాన్’ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష