బిగ్‌బాస్ తెలుగు సీజన్‌-10 ప్రమో.. ఈసారి అన్నీ పదింతలే!

August 16, 2026


img

బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో స్టార్ మా..జియో హాట్ స్టార్ ఛానల్లో ప్రసారమయ్యే ‘బిగ్‌బాస్ తెలుగు’ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్‌-10 ప్రోమో తాజాగా విడుదలైంది. ఈసారి గత సీజన్ల కంటే పది రెట్లు ఎక్కువ సర్‌ప్రైజ్‌లు, డ్రామా, ఛాలెంజ్‌లు ఉంటాయని ప్రొమో ద్వారా చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. 

‘ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్...’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్‌తో ఈ సీజన్‌పై మరింత హైప్ పెంచారు. తాజాగా విడుదలైన ఈ ప్రొమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ సీజన్ సెప్టెంబర్ 6న ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రీమియర్ తేదీని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సీజన్‌లో పాల్గొనబోయే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఇన్సర్స్, టీవీ నటీనటుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో జ్యోతి, దీపికా రంగరాజు, ఉప్పల్ బాల, కళ్యాణ్, పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, పండు మాస్టర్, చంద్రహాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరి ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష