ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఒక చక్కటి ఆఫర్ ప్రకటించింది.
రూ.2,399 విలువైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లో వ్యాలిడిటీ 365 రోజులు. కానీ నేటి నుంచి సెప్టెంబర్ 12లోగా ఈ ప్లాన్ సబస్క్రిప్షన్ తీసుకున్నవారికి అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అంటే అంతే సొమ్ము చెల్లించి 412 రోజులు వ్యాలిడిటీ పొందవచ్చన్న మాట!
అలాగని ఈ ప్లాన్‌లో ఏదీ తక్కువ చేయలేదు. రోజుకి 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తారు.
కనుక ఏడాదికి ఒక్కసారి రీ ఛార్జ్ షీట్ చేసుకుంటే 412 రోజులు నిరంతరాయంగా ఫోన్ వాడుకోవచ్చు. ఇది అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్ధులు, వృద్ధులు, వ్యాపారులు, మహిళలకు మరింత సౌలభ్యంగా ఉంటుంది.