ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారులపై జొమాటో మరో భారం మోపింది. క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆర్డర్ చేసే వారి నుంచి అదనంగా రూ.5 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఈ అదనపు ఛార్జీ అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చని, ఆర్డర్ విలువ, రవాణా సమయం, దూరాన్ని బట్టి మారే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే జొమాటో ఈ ఏడాది మార్చిలో ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. గతంలో ఒక్కో ఆర్డర్‌పై రూ.12.50గా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14.90కి పెంచింది. అంటే ఒక్కో ఆర్డర్‌పై రూ.2.40 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ పెంపు సుమారు 19.2 శాతంగా ఉంది. జీఎస్టీతో ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు మరింత పెరుగుతుంది.
డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చెపుతున్నప్పటికీ, నానాటికీ పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఆదాయం స్థిరీకరణ చేసుకొని లాభాలు పెంచుకునేందుకు ఈ అదనపు వడ్డింపు అని సమాచారం.
జోమోటో బాటలోనే మిగిలిన కంపెనీలు నడుస్తూ త్వరలో డెలివరీ చార్జీలు పెంచక మానవు. కనుక ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారిపై ఈ అదనపు భారం పడుతుంది. ఇది ఇక్కడితో ఆగదు కనుక క్రమంగా పెరుగుతుంది.