ఆదర్శ కుటుంబం.. టీజర్‌ రేపే!

September 11, 2026


img

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47’ నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించే హీరో, విలన్‌ గ్యాంగుతో ఫైట్ చేయబోతున్నాడన్నట్లు చూపారు.

ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 చిరునామాకి షార్ట్ ఫామ్‌గా ఏకే-47 అని పెట్టినప్పుడే, అవసరమైతే ఏకే-47 తుపాకీలా గర్జిస్తాడని హింట్ ఇచ్చారు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. రేపు టీజర్‌లో అదే చూపిస్తారని పోస్టర్‌లో మరో హింట్ ఇచ్చారు.          

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. ఇంకా రావు రమేష్,  బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్,  ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేస్తున్నారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష