నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. ఈ సినిమా నుంచి ‘ఓయ్ ఓయ్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలయింది. రెహమాన్ వ్రాసిన ఈ పాటకి కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించి, స్వయంగా పాడారు.
తప్పు లెన్నువారు తమ తప్పులు ఎరుగారని ఈ పాట ద్వారా మరోసారి గుర్తుచేశారు. పాట సరదా సరదాగా ప్రశ్నించేలా సాగుతుంది.
ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, తులసి, హర్షిత బండ్కమూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాథ్ రెడ్డి, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ చేశారు.
మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘సీక్రెట్ సోల్జర్’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.