వడ్డీ కాసులవాడలో శ్రీ వేంకటేశ్వర స్వామిగా రవి మోహన్

September 08, 2026


img

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న‘వడ్డీ కాసులవాడ’ సినిమాపై ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ రవి మోహన్ శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్నారని మంచు మనోజ్ స్వయంగా చెప్పారు.

శ్రీ వెంకటేశ్వర స్వామిని దేశవ్యాప్తంగా పూజిస్తారు. ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రం తమిళనాడు స్వామివారికి భక్తులు ఎక్కువ. కనుక ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నామని మంచు మనోజ్ తెలిపారు.

తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో సాగుతుంది. 

తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రకు భార్య ఆర్తితో విడాకులు తీసుకొని సింగర్ కెనిషాతో ప్రేమాయణం నడుపుతున్న రవి మోహన్ని ఎంపిక చేయడంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. 


Related Post

సినిమా స‌మీక్ష