తాతా మధు, నవీన్ రెడ్డిలకు మరోసారి ఊరట

September 08, 2026


img

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను, ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ దానిని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించగా మండలి కూడా దానిని ఆమోదించింది.

శాసనసభ సమావేశాలు ఎలాగూ త్వరలో ముగుస్తాయి. కనుక ఈ సస్పెన్షన్ వేటుతో వారికి పెద్ద తేడా ఉండదు. నిజానికి వవారిలో తాత మధుపై అనర్హత వేటు వేయాలని మొదట భావించినప్పటికీ అయన బేషరతుగా క్షమాపణ కోరినందున సస్పెన్షన్‌తో సరిపెట్టారు.

నాంపల్లి కోర్టు కూడా వారికి రిమాండ్ అవసరం లేదంటూ బెయిల్‌ మంజూరు చేసింది. కనుక ఇద్దరూ పెద్ద సమస్య నుంచి చాలా తేలికగానే బయటపడ్డారని చెప్పవచ్చు.


Related Post