రేవంత్ రెడ్డిపై మళ్ళీ సుష్మిత విమర్శలు

September 04, 2026


img

కొండా సురేఖ కుమార్తె సుష్మిత సిఎం రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల కారణంగా పదవి కోల్పోయి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని కొండా సురేఖ చెపుతుండగా, ఆమె కుమార్తె సుస్మిత మళ్ళీ సిఎం రేవంత్‌ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. “నేనేమీ నర్సరీ చదువుతున్న చిన్న పిల్లను కాను. ఇంటికి రాగానే నా తల్లి నన్ను ప్రశ్నించడానికి? అసలు నా వ్యాఖ్యలకు మా అమ్మకు ఏం సంబంధం? నేను మాట్లాడిన దానికి ఆమెని ఎలా బాధ్యురాలు అవుతారు?

సిఎం రేవంత్‌ రెడ్డి వన్ టైం జెడ్పీటీసీ, వన్ టైం ఎమ్మెల్సీ, వన్‌టైమ్ ఎమ్మెల్యే,వన్ టైమ్ ఎంపీ, మా అమ్మ ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా చేశారు. అలాంటి రేవంత్ రెడ్డి మా అమ్మను అవమానించాడు. ఇక వన్ టైమ్‌ సిఎంగా మిగిలిపోతాడేమో?” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఆమె మొదట చేసిన విమర్శల దెబ్బకి తల్లి మంత్రి పదవి ఊడింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే కొండా దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగాలనుకున్నా ఉండలేని పరిస్థితి కల్పిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కనిపిస్తోంది.   


Related Post