మంత్రి పదవి నుంచి తొలగింపబడిన కొండా సురేఖకు ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీలో చేరాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు.
అయన ఏమన్నారంటే, కేవలం 5 శాతం ఉన్న రెడ్లను కాంగ్రెస్ పార్టీ 12సార్లు ముఖ్యమంత్రిని చేసింది. కానీ 50 శాతం ఉన్న బీసీలను కానీ, వారితో కలిపి 90 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంతసేపు ఆ రెడ్డా ఈ రెడ్డా అనే చర్చ తప్ప బడుగు బలహీన వర్గాల గురించి మాట వినిపించదు.
కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సిఎం రేవంత్ రెడ్డిని ఎంత తిట్టినా వారి పదవులు పోవు. కానీ బీసీ మహిళ కొండా సురేఖ కూతురు సుస్మిత ఏదో మాట్లాడిందని పదవిలో నుంచి తీసేసి అవమానించారు. చాలా మంది పార్టీలు పెడతారు. తర్వాత ప్యాకేజిలకు అమ్ముడుపోతారు. కానీ అందరికీ న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒక్కటే. కొండా సురేఖతో సహా అందరికీ ప్రజాశాంతి పార్టీ ఆహ్వానం పలుకుతోంది,” అని అన్నారు.