విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా వస్తున్న ‘అనుమాన పక్షి’ నుంచి ‘అతిగా ఆలోచించకురా..’ అంటూ సాగే యానిమేషన్ సాంగ్ విడుదలైంది. కిట్టు విస్సాప్రగడ వ్రాసిన ఈ పాటకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సాన్వి, రవి ప్రకాశ్ చోడిమళ్ల కలిసి ఆలపించారు.
ఈ సినిమాలో మేరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: విమల్ కృష్ణ, కెమెరా:సునీల్ కుమార్ నామా, ఆర్ట్: జేకే మూర్తి, ఎడిటింగ్: చోట కే ప్రసాద్, కోరియోగ్రఫీ: ఈశ్వర్ చేశారు.
చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవి చిలక, మెగా చిలక నిర్మించిన అనుమాన పక్షి సెప్టెంబర్ 18న విడుదల కాబోతోంది.