ఐ యామ్ గేమ్..చివరి నిమిషంలో వాయిదా

September 03, 2026


img

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఐ యామ్ గేమ్’ సినిమా నేడు మలయాళంలో విడుదలైంది. కానీ తెలుగులో విడుదల కాలేదు. చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. అనివార్య కారణాల వలన నేడు సినిమా విడుదల చేయలేకపోతున్నామని త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 

నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దుల్కర్ సల్మాన్‌కు జంటగా కాయదు లోహర్ నటించగా, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: నహాస్ హిదాయత్, స్క్రీన్‌ప్లే: సజీర్ బాబా, బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబక్కర్, డైలాగ్స్: ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్, కెమెరా: జిమ్షీ ఖాలిద్, ఎడిటింగ్: చమన్ చక్కో చేశారు. 

వేఫేర్ ఫిల్మ్స్ సమర్పణలో దుల్కర్ సల్మాన్, జోమ్‌ వర్గీస్ కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష