నేడు నిజామాబాద్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తూ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “ఇప్పుడు నేను ఎంపీగా లేను. ఏడేళ్ళుగా నువ్వే ఉన్నావు. ఆరోజు ఎన్నికలలో ఏం చెప్పావు? నన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గంలో అన్ని పనులు పూర్తి చేస్తానన్నావు కదా? ఏడేళ్ళు ఎంపీగా ఉన్నావు కానీ మాధవ నగర్ వంతెన నిర్మాణం ఎందుకు పూర్తిచేయలేక పోయావు? గాడిదకు పళ్ళు తోముతున్నవా?
ఎంతఃసేపు సేల్ఫీలు తీసుకోవడం సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఇదే పనా? ఎంపీగా నీకు బాధ్యత లేదా? ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది. కానీ నీలో మొత్తం అధర్మమే నిండిపోయింది. ఈ వంతెన పూర్తిచేయడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది? జవాబు చెప్పు,” అంటూ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు.
భోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ, “కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో దానిని తెరిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కనుక నేను దాని గురించి పదేపదే అడిగేదానిని. భోధన్ ప్రజలను తీసుకొని వెళ్లాను కూడా.
కానీ తర్వాత తెలిసింది మా అన్న కేటీఆర్ దానిని తన స్నేహితుడు కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ కోసం పక్కన పెట్టారట. అందుకే నేను ఎంతగా పోరాడినప్పటికీ దానిని తెరిపించానీయలేదు,” అంటూ కల్వకుంట్ల కవిత తన అన్నపై ఆరోపణ చేశారు.
ధర్మపురి అరవింద్ గారు 7 ఏళ్లుగా ఎంపీగా ఉండి మాధవనగర్ బ్రిడ్జ్ ఎందుకు పూర్తి చేయలేదు? ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చారు?. పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు.
మీ పేరులో ధర్మం ఉంది, కానీ మనిషి మొత్తం అధర్మమే.
- తెలంగాణ రక్షణ సేన… pic.twitter.com/SbTVJ7aO82