పవన్ కళ్యాణ్‌ జన్మదిన కానుక ఓజీ సీక్వెల్ అప్‌డేట్‌

September 02, 2026


img

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ ఓజీ యూనివర్స్ అంటూ ఓ ఆసక్తికరమైన వీడియో విడుదల చేశారు. దానిలో ఓజీ సీక్వెల్ గురించి సుజీత్, సంగీత దర్శకుడు తమన్, పవన్ కళ్యాణ్‌తో చర్చిస్తున్నట్లు చూపారు.

ఇండియన్ ఆరిజన్.. సౌత్ ఈస్ట్ ఎమోషన్.. వెస్ట్రన్ ప్రెజంటేషన్ అంటూ వినిపించిన మాటలు సీక్వెల్‌ మొదటి భాగానికి మించి ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్లనిపిస్తుంది. 

ఓజీ సక్సస్ మీట్లోనే పవన్ కళ్యాణ్‌ సీక్వెల్‌ చేస్తానని ప్రకటించారు. కానీ ఏపీ డెప్యూటీ సిఎంగా, జనసేన పార్టీ అధ్యక్షుడుగా క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్న పవన్ కళ్యాణ్‌ సీక్వెల్‌ మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకోవచ్చునని చాలా మంది భావించారు.

కానీ సుజీత్ స్పీడ్ చూస్తే త్వరలోనే కొబ్బరికాయ కొట్టేసి షూటింగ్‌ మొదలుపెట్టేయబోతున్నట్లే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌ అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన వార్త ఏముంటుంది?           


Related Post

సినిమా స‌మీక్ష