కొండా సురేఖకు లాస్ట్ కాల్… ఏం చెప్తారో?

September 03, 2026


img

మంత్రి కొండా సురేఖకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. సాయంత్రం సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ తిరిగి వచ్చేలోగా రాజీనామా చేయాలని లేకుంటే మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ అండ్ టఫ్‌ చేసినట్లు గవర్నర్‌కు లేఖ వెళ్తుందని హెచ్చరించింది. కనుక పరిస్థితి అంత వరకు తెచ్చుకోవద్దని కాంగ్రెస్‌ అధిష్టానం హితవు పలికింది. 

మంత్రి కొండా సురేఖ నిన్న రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగి రాగానే తన భర్త, అనుచరులతో సమావేశమయ్యారు.  ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం నిర్వహించి ఏదో చెప్పాలనుకున్నారు. కానీ ఈలోపుగా కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి లాస్ట్ కాల్ వచ్చింది. 

కనుక ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీలో ఉండాలనుకుంటే రాజీనామా చేయక తప్పదు. కానీ పార్టీ వీడాలనుకుంటే రాజీనామా చేయకుండా బర్త్ రఫ్ చేయించుకునే అవకాశం ఉంది. అప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌లో పలువురి అవినీతిని ప్రశ్నించినందుకే తనని పదవిలోనుంచి తొలగించారని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందవచ్చు.

ఇది తనకు జరిగిన అవమానం కాదని యావత్ బీసీ మహిళలకు జరిగిన అవమానంగా భావించి పార్టీకి కూడా రాజీనామా చేసేశానని చెప్పుకోవచ్చు. కనుక కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది సస్పెన్స్. మరి కొన్ని గంటలలో ఆ సస్పెన్స్ కూడా వీడుతుంది.


Related Post