మంత్రి పదవి నుంచి తొలగింపబడిన తర్వాత కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను బయటకు పంపకపోతే తాను రాజీనామా చేస్తానంటూ సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేశారు. అందువల్లే నన్ను వదులుకుంది తప్ప అధిష్టానానికి ఇటువంటి ఆలోచన లేదు. ఉరిశిక్ష పడిన నేరస్థుడిని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ నేను ఏ తప్పు చేయకపోయినా పదవిలో నుంచి తొలగించారు. నన్నుఎందుకు తొలగిస్తున్నారో చెప్పలేదు. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి అందరూ నాపై కక్షకట్టారు. అందరూ కలిసి నన్ను బయటకు పంపేందుకు నాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. చివరికి నా ఓఎస్‌డీ సుమంత్‌పై కూడా కుట్రలు చేసి అక్రమ కేసు బనాయించి వేదిస్తున్నారు,” అంటూ కొండా సురేఖ నిప్పులు చెరిగారు.