కామ్రేడ్ కళ్యాణ్‌ 5 టీజర్‌, 9న మూవీ రిలీజ్‌

September 04, 2026


img

జానకీ రామ్‌ మారెళ్ళ దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా టీజర్‌ రేపు (శనివారం) విడుదల కాబోతోంది. 

ఈ సినిమాలో మోస్ట్ వాంటడ్‌ మావోయిస్టుగా శ్రీవిష్ణు నటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులను ఏరిపారేసిన తర్వాత శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అంటూ వస్తుండటం విశేషం. అయితే ఇది 90లలో జరిగిన కథ కనుక తాజా పరిణామాలతో సంబంధం లేదు.   

ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్‌, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.    

ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్‌ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.            

స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ సెప్టెంబర్‌ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష