ఈ నెల 10న సుహాస్ ‘మండాడి’ రిలీజ్‌

September 04, 2026


img

సుహాస్, కోలీవుడ్‌ నటుడు సూరి ప్రధాన పాత్రలు చేసిన ‘మండాడి’ ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ ఈ సినిమాఫై అంచనాలు పెంచింది. 

ఈ సినిమా కోసం తన జీవితంలో ఎన్నడూ చేయనంత రిస్క్ చేశానని సుహాస్ అన్నారు. సముద్రంలో బోట్ రేసింగ్ కధాంశంగా ఉన్న ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయానని, కానీ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డానని సుహాస్ చెప్పారు. 

సుమారు 45 రోజుల పాటు సముద్రంపై షూటింగ్‌ జరిగిందని, ఆ సమయంలో కెమెరాలతో సహా యూనిట్ సభ్యులు కూడా సముద్రంలో పడిపోయారని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బతికి బయట పడ్డామని చెప్పారు.  కనుక జీవితంలో మళ్ళీ ఎన్నడూ ఇలాంటి సినిమా చేయనని సుహాస్ చెప్పారు.      

ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్ జై శంకర్, రవీంద్రవిజయ్, బాల సరవణన్, స్టన్ శివ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. 

ఈ సినిమాకు రచన, దర్శకత్వం: మతిమారన్ పుగళేంధి, తెలుగులో పాటలు: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, అభినవకవి, రాంబాబు గోసల, సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్‌, సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కదిర్, కొరియోగ్రఫి: అజర్, స్టంట్స్: పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేశ్ మాథ్యూ, ఎడిటింగ్: ప్రదీప్ ఈ. రాఘవ్, వీఎఫ్‌ఎక్స్‌: ఆర్. హరిహర సుతన్ చేశారు.   

ఇన్ఫోటైన్‌మెంట్ మరియు మడ్‌వే రికార్డ్స్ బ్యానర్లపై ఆర్‌ఎస్ ఎల్రెడ్ కుమార్‌,  వి.మణికందన్ కలిసి ఈ సినిమా నిర్మించారు. సెప్టెంబర్‌ 10న మండాడి థియేటర్లలో విడుదల కాబోతోంది.   


Related Post

సినిమా స‌మీక్ష