అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’. వెంకీ కుడుముల నిర్మాణంలో వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున నిన్న సాయంత్రం టీజర్ విడుదల చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ విషయం తెలియజేస్తూ, “‘ఏ అద్భుతమైన సంచలనమైనా పేలడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది,” అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. హీరోయిన్ చేత అది చెప్పించిన విధానం బాగుంది. అయితే టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మహేష్ ఉప్పల, సంగీతం: తమన్, కెమెరా: రాజా మహదేవన్, స్టంట్స్:దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు.
వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్: నం:1గా తీస్తున్న ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల నిర్మిస్తున్నారు.
Every banger takes a little more time to explode 💥#ItlluArjuna Teaser is not releasing today but the team is cooking something crazy 👨🍳🔥
— T-Series South (@tseriessouth) September 9, 2026
The best of the experiences is loading soon....
A @MusicThaman Musical 🎹
In Theaters this October 9th..!!@anieshforyou #AnaswaraRajan pic.twitter.com/RNfvTMKpgg