సూర్య కొత్త సినిమా సీన్ టైటిల్‌ గ్లిమ్స్‌

September 09, 2026


img

ఇటీవల ‘విశ్వనాధ్ అండ్ సన్స్’తో హిట్ కొట్టిన సూర్య వెంటనే మరో కొత్త సినిమా ‘సీన్’తో వచ్చేస్తున్నారు. జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌ నేడు విడుదల చేశారు. ఇది సూర్య మార్క్ పోలీస్ క్రైమ్‌ యాక్షన్ సినిమా అని టైటిల్‌ గ్లిమ్స్‌ చూస్తే అర్ధమవుతోంది. 

ఈ సినిమాలో నజ్రియా నజీమ్, నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా సీన్’ తమిళ్ వెర్షన్ ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. మరికొద్ది సేపటిలో తెలుగు వెర్షన్ కూడా వస్తుంది. 

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జీతు మాధవన్, సంగీతం: సుషిన్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: వినీత్ ఆగస్టియన్, ఎడిటింగ్: అజ్మల్ సాబు, యాక్షన్ డైరెక్టర్: చేతన్ డిసౌజా, ఆర్ట్:  ఏ. రాజేష్.

ఝగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. జై శ్రీదామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా దీపావళి పండుగకు విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/_nuRAflabx8?si=v05XHJc3sXlu5xzi" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష