రణబాలి టీజర్‌ చూశారా?

September 09, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత జంటగా చేస్తున్న చిత్రం రణబాలి. ఈ సినిమాలో రష్మిక పాత్ర పేరు జయమ్మ. బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దీనిలో ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు. అక్టోబర్ 16న ‘రణబాలి’ విడుదల కాబోతోంది కనుక నేడు టీజర్‌తో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. 

టీజర్‌లో 1876-78 సంవత్సరాల మధ్య కాలంలో బ్రిటిష్ వారి పాలనలో ప్రాణాలు కోల్పోయిన 80 లక్షల మంది స్మ్రుత్యర్యర్ధం అంటూ నాటి దయనీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపారు. బ్రిటిష్ వారి దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడి కథే రణబాలి. ఈ సినిమాలో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.  

 ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో నిర్మిస్తున్న రణబాలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/L7qEKA-e2qI?si=TsxApETVeW4w1PaW" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష