క్రేజీ కల్యాణం నుంచి కాక ధూమ్ ధమాకా సాంగ్‌ ప్రమో

September 09, 2026


img

అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్ భాస్కర్‌ భాస్కర్, వికె నరేష్, అఖిల్ ఉద్దెమారి ప్రధానపాత్రలు చేస్తున్న క్రేజీ కల్యాణం సినిమా నుంచి కాక ధూమ్ ధమాకా సాంగ్‌ ప్రమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది.

పెళ్ళి వేడుకలో హుషారుగా సాగే గ్రూప్ డాన్స్ కోసం కాసర్ల శ్యాం వ్రాసిన ఈ ‘కాక ధూమ్ ధమాకా’ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, జంగి రెడ్డి హుషారుగా పాడారు. పూర్తి పాట ఈ నెల 12న విడుదల కాబోతోంది.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: బద్రప్ప గజుల, సాహిత్యం: గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, దినేష్ కక్కెర్ల, సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దుపాటి, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని, యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్ చేస్తున్నారు. 

యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా బూసం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష