బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు

September 09, 2026


img

నేడు శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్‌ పార్టీ సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ఆటంకం కలిగిస్తుండటంతో మంత్రి శ్రీధర్ బాబు సిఫార్సు మేరకు  స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ మొత్తం అందరినీ సభ నుంచి ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

సస్పెండ్ అయిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు: కేటీఆర్‌, హరీష్‌ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సుదీర్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్‌, విజయుడు, కోవా లక్ష్మి, అనిల్ రావిపూడి జాదవ్.


Related Post