నివేదా థామస్ ప్రధాన పాత్రలో చేస్తున్న కొత్త సినిమా పేరు ‘శ్రీమతి.’ విశ్వక్ ఖందేరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌లో డాన్సర్ కావాలనే తన అభిరుచిని ఓ గృహిణి తన కుటుంబం కోసం త్యాగం చేసి, వంట గదిలోనే ఆ ముచ్చట తీర్చుకున్నట్లు డాన్స్ భంగిమలో ఉన్న నివేదా థామస్, ఓ పక్క కాళ్ళ గజ్జెలు, మరోపక్క వంట సామాను చూపారు. అంటే ఇది కూడా ఆమె నటించిన ‘35 చిన్న కథ కాదు’ వంటి చక్కటి సినిమా అనిపిస్తోంది.
ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతిని పరిచయం చేస్తూ జీ5 తెలుగు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోతో కథ మొత్తం చెప్పేశారు.
Meet Srimathi. ❤️
— ZEE5 Telugu (@ZEE5Telugu) August 31, 2026
A woman whose world is filled with warmth, relationships, and unexpected moments. #Srimathi Coming Soon on Telugu Zee 5.#SrimathiOnZee5 #TeluguZee5 #WatchOnZee5#TeluguZee5SlateLaunch pic.twitter.com/3ZtKR89bym