అవును. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగారు. ఒకరు రాజకీయాలలో మరొకరు సినిమా షూటింగ్‌లతో క్షణం తీరిక లేని జీవితం గడుపుతుంటారు. వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవాలన్నా తీరిక చిక్కదు.
మరి కేటీఆర్ హటాత్తుగా ప్రభాస్‌కు ఎప్పుడు, ఎందుకు ఫోన్ చేశారంటే, అండర్ 18 టీనేజ్ విద్యార్ధులతో కేటీఆర్ పాడ్ క్యాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆ బాలికలు సరదాగా ప్రభాస్‌తో మాట్లాడుతామన్నారు.
కానీ అయన బిజీగా ఉంటారు. మీతో మాట్లాడరని కేటీఆర్ చెప్తున్నా కేటీఆర్ చేత ప్రభాస్‌కు ఫోన్ చేయించి, ఆయన చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఓ బాలిక మాట్లాడింది.
ఈ ఫోన్ తనకు రోడ్డుపై దొరికిందని, దానిలో మీ నంబర్ చూసి ఫోన్ చేస్తున్నానని చెప్పగానే ప్రభాస్ టక్కున ఫోన్ పెట్టేశారు. కేటీఆర్ చెప్పినట్లే ప్రభాస్ ఫోన్ కట్ చేయడంతో అందరూ నవ్వుకున్నారు.
ఆ తర్వాత కేటీఆర్ ఫోన్ చేసి ప్రభాస్‌కు విషయం చెప్పి కుశల ప్రశ్నలు వేసి, ఈసారి ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఈ బాలికలకు కాస్త సమయం కేటాయించాలని కోరి ముగించారు. ఇదీ కేటీఆర్-ప్రభాస్ ఫోన్ కాల్ కథ! ఆ లింక్: https://www.facebook.com/reel/1618990669971646 .