వాచస్పతి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్సింగ్ మేఘన’ ఈనెల 18న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రామ్ కార్తీక్, వైదిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ శనివారం ఉదయం 11.34 గంటలకు విడుదల కాబోతోంది.
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్ తదితరులు మిస్సింగ్ మేఘనలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే: వనరాజ్; సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్; కెమెరా: శ్యాం కే నాయుడు; డైలాగ్స్: వెంకట్ బాదిగం; పాటలు: ఆర్ ఆర్ ధృవాన్; ఆర్ట్ డైరెక్టర్: గురు మురళీకృష్ణ; ఎడిటింగ్: బసవ; ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్ చేస్తున్నారు.
ఫస్ట్ కాపీ మోవీస్, కేడి అండ్ కో బ్యానర్లపై దేవెళ్ల శ్రీనివాసరావు సహ నిర్మాతగా నరేష్ బాబు పంచుమర్తి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈనెల 18న మిస్సింగ్ మేఘన థియేటర్లలో ప్రేక్షకులకు కనిపించబోతోంది.