ఈ వారం ఓటీటీ సినిమాలతో పైసా వసూల్

September 11, 2026


img

అవును. ఈ వారాంతంలో ఓటీటీలలో విడుదలవుతున్న కొన్ని సినిమాలతో, ప్రేక్షకులు ఓటీటీల కోసం చెల్లిస్తున్న ప్రతీ పైసా వసూల్ అయిపోతుంది. వాటిలో సూర్య, మామిత బిజు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్, విశాల్ నటించిన మకుటం వంటి సినిమాలు, చుంబక్ వంటి చక్కటి హిందీ వెబ్‌ సిరీస్‌ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలోకి విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ఇవే.. 

నేటి నుంచి ప్రసారం అవుతున్నవి.. 

నెట్‌ఫ్లిక్స్‌: విశ్వనాథ్ అండ్ సన్స్ (తెలుగు డబ్బింగ్), గో టీమ్‌ (స్పానిష్), చుంబక్ (హిందీ వెబ్‌ సిరీస్‌), కాల్ మై ఏజంట్! ద మూవీ (వెబ్‌ సిరీస్‌ ఇంగ్లీష్). 

అమెజాన్ ప్రైమ్‌ వీడియో: మకుటం (తెలుగు డబ్బింగ్), మహారాజ హాస్టల్ (తెలుగు డబ్బింగ్), సల్మోఖ్జీ (కొరియన్ తెలుగు డబ్బింగ్ సినిమా), మ్యాజిక్ మష్ రూమ్స్, అచ్యుత అవతారం (మలయాళ సినిమాలు), డియోల్ బాంద్-2 (మరాఠీ సినిమా),  ద రివల్యూషనరీ (తెలుగు డబ్బింగ్ వెబ్‌ సిరీస్‌).

జీ5: పంచనామా (తెలుగు వెబ్‌ సిరీస్‌), ఘమసాన్ (హిందీ సినిమా), అద్కిట్టా (మరాఠీ సినిమా). 

జియో హాట్ స్టార్: ది పేపర్ సీజన్‌ 2 (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌), ఆలీబాబా ఔర్ 40 భూత (హిందీ వెబ్‌ సిరీస్‌), ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ వెబ్‌ సిరీస్‌), వన్ నైట్ వోయేజ్‌ (జపనీస్ వెబ్‌ సిరీస్‌), లిబాంగ్ లిబు (మలేషియా సినిమా). 

ఆహా: కట్టాలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా), వరవు (తెలుగు డబ్బింగ్ సినిమా), వెంజన్స్ (తమిళ సినిమా). 

సన్ నెక్స్ట్: వివః (మలయాళ సినిమా).


Related Post

సినిమా స‌మీక్ష